
జూరాల క్రస్ట్ గేట్ల మూసివేత
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో సోమవారం క్రస్ట్ గేట్లు మూసినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. జల విద్యుదుత్పత్తి నిమిత్తం 10 వేల క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 1,250, కుడి కాల్వకు 470, ఆర్డీఎస్ లింక్ కాల్వకు 150, భీమా లిఫ్ట్–2కు 750, సమాంతర కాల్వకు 1,150 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.790 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
విద్యుదుత్పత్తి నిలిపివేత..
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద చేరకపోవడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వరకు విద్యుదుత్పత్తి చేపట్టామని.. ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 119.406 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 141.208 మి.యూ. ఉత్పత్తి చేపట్టినట్లు వివరించారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 261.208 మి.యూ. విద్యుదుత్పత్తి జరిగిందన్నారు.
సుంకేసులకు 30 వేల క్యూసెక్కుల వరద..
రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి సోమవారం వరద కొనసాగింది. 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 8 గేట్లు తెరిచి 31,928 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్‌కు 760 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర పేర్కొన్నారు.