
తప్పుడు రిపోర్టు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్‌పై చర్యలు
అయిజ: గర్భిణికి తప్పుడు రిపోర్టు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్‌పై చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ సిద్దప్ప తెలిపారు. ఈ ఘటనపై ‘సాక్షిశ్రీలో ‘గర్భిణికి తప్పుడు రిపోర్టు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ ‘సాక్షి’తో మాట్లాడుతూ గర్భిణికి తప్పుడు రిపోర్టు ఇచ్చిన ఘటనపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. గర్భిణికి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేయాలని సూపరింటెండెంట్ ఇందిరకు సూచించారు. ఇదిలా ఉండగా.. గర్భిణికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) నాయకులు సోమవారం ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ సిద్దప్పకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కార్తీక్, హలీంపాష, హరీష్, దానయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు రిపోర్టు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్‌పై చర్యలు