– వివరాలు 9లో..
‘స్థానిక’ఎన్నికల్లో సత్తా చాటాలి: డీకే అరుణ
మిడ్జిల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. సోమవారం మిడ్జిల్‌లో తన ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ గార్డెన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కేంద్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో కాంగ్రెస్ తమ పథకాలు అని చెప్పి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని, దీనిపై కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, జనార్దన్‌రెడ్డి, రాజేశ్వర్, తిరుపతి, నరేష్‌నాయక్, లాలు, రవిందర్, తదితరులు పాల్గొన్నారు.