
వధశాల లేక ఎన్నో ఇబ్బందులు
జిల్లా కేంద్రంలో వధ శాల లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పని పరిస్థితులలో ఇళ్ల వద్దే జీవాలను కోసి మార్కెట్‌కు తెస్తున్నాం. పరిసరాలలో మొత్తం రక్తపు మరకలు ఏర్పడమే గాక ఈగ లు, దోమలు ముసురుకుంటున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పటికై నా కోస్గిరోడ్డులో సుమారు 12 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న వధశాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. – నరేందర్, మాంసం వ్యాపారి,
షాషాబ్‌గుట్ట, మహబూబ్‌నగర్
బాధ్యులపై
చర్యలు తీసుకుంటాం
జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వివిధ చికెన్ షాపులలో వేస్టేజీని సేకరించి తరలించే వారిపై తగు చర్యలు తీసుకుంటాం. ఇక మటన్‌కు సంబంధించి కోస్గిరోడ్డులోని స్లాటర్‌హౌస్ (వధశాల) నిర్మాణం చివరి దశలో ఉంది. త్వరలోనే దానిని ప్రా రంభించి ఆరోగ్యకర జీవాలను అక్కడే కో యడానికి అనుమతి ఇస్తాం. వెటర్నరీ అధికారితో పాటు మా సిబ్బంది సమక్షంలో ముద్ర వేసిన తర్వాతే మాంసం అమ్మేలా చూస్తాం.
– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్
●