
ఇంకుడుగుంతల నిర్మాణాలతో సత్ఫలితాలు
మహమ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంకుడుగుంతల నిర్మాణాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. బుధవారం మండలంలోని నంచర్ల, గాధిర్యాల్, చౌదర్‌పల్లి, ధర్మాపూర్, మహమ్మదాబాద్‌లో కేంద్ర బృందం జలశక్తి జలభాగ్యధారి అధికారి సైంటిస్టు సందీప్‌కుమార్ ఇంకుడుగుంతల నిర్మాణాలు వాటి వినియోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గుంతల వినియోగం ఎలా ఉన్నదని, భూగర్భజలాలు పెరిగే అవకాశమున్నదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడుగుంతల నిర్మాణాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వినియోగించిన నీరు వృథా కాకుండా తిరిగి భూమిలోకి ఇంకిపోతున్నందున భూగర్భజలాలు పెరిగే అవకాశమున్నదని ఆయా గ్రామాల్లో రైతులు ప్రజలు తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగమవుతున్నట్టు తెలిపారు. ఈయన వెంట ఈఎన్‌సీ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ, ఏపీఓ హరిశ్చంద్రుడు, టీఏలు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.