విద్యుదాఘాతంతోరైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతోరైతు మృతి

Jul 11 2025 6:31 AM | Updated on Jul 11 2025 6:31 AM

విద్య

విద్యుదాఘాతంతోరైతు మృతి

ఖిల్లాఘనపురం: ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై రైతు మృతి చెందిన ఘటన మండలంలోని సల్కెలాపురం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా గురువారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుడి భార్య లక్ష్మి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుళ్ల నాగయ్య(40) వ్యవసాయ పొలంలో బుధవారం రాత్రి వరి నారుమడికి నీళ్లు పెడుతుండగా మోటార్‌ వద్ద విద్యుత్‌ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

కల్లు తాగి ‘ఖిల్లా’ వృద్ధురాలి మృతి

ఖిల్లాఘనపురం: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌ కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కు టుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన సింగనమోని వెంకటమ్మ(65) కుమార్తె అనసూయ హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటుంది. కుమారుడు నాగయ్య నాగర్‌కర్నూల్‌లో తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటున్నాడు. ఇటీవల కుమార్తెను చూడటానికి వెంకటమ్మ కూకట్‌పల్లికి వెళ్లింది. దీంతో కుమార్తె హైదర్‌నగర్‌ కల్లు దుకాణం నుంచి ఆది, సోమవారం రెండు రోజులు కల్లు తీసుకెళ్లి తల్లికి తాగించింది. మంగళవారం విరోచనాలు కావడంతో తగ్గుతుందిలే అనుకున్నారు. కానీ రాత్రి వరకు ఎక్కువ కావడంతో బుధవారం ఉదయం నేరుగా నాగర్‌కర్నూల్‌లో ఉంటున్న కుమారుడు నాగయ్య వద్దకు తీసుకొచ్చి, ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం వృద్ధురాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కొంకల యువకుడు తిరుపతిలో మృతి

రాజోళి: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన యువకుడు చాకలి వీరేష్‌(20) తిరుపతిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సోములు, పద్మ దంపతుల రెండో కుమారుడు వీరేష్‌ మూడేళ్లుగా తిరుపతిలోని కంకర మిషన్‌కు ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గ్రామానికి చెందిన మరికొందరు యువకులు కూడా అక్కడే పని చేసి వివాహం చేసుకొన్న తర్వాత గ్రామానికి తిరిగి వచ్చినప్పటికీ వీరేష్‌ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం మృతుడి తల్లిదండ్రులకు తిరుపతి నుంచి ఫోన్‌ చేసి మీ కుమారుడు చనిపోగా.. మృతదేహం రైలు పట్టాలపై పడి ఉందని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే తిరుపతికి బయలుదేరి వెళ్లారు. కాగా తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత కారణాలు ఏం లేవని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బోరు మోటార్‌ వేయడానికి వెళ్లి..

చారకొండ: విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రాంపురం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ అంజయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటనారాయణగౌడ్‌(54) తన వ్యవసాయం పొలంలో బోరు మోటార్‌ వేయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

విద్యుదాఘాతంతోరైతు మృతి 
1
1/3

విద్యుదాఘాతంతోరైతు మృతి

విద్యుదాఘాతంతోరైతు మృతి 
2
2/3

విద్యుదాఘాతంతోరైతు మృతి

విద్యుదాఘాతంతోరైతు మృతి 
3
3/3

విద్యుదాఘాతంతోరైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement