
నిలువెత్తు నిర్లక్ష్యం
జిల్లాలో నెరవేరని వనమహోత్సవం లక్ష్యం
●
చిత్తశుద్ధితో చేపట్టాలి..
భవిష్యత్ తరాల మనుగడ కోసం పర్యావరణ సమతుల్యతను సాధించేలా హరితహారం, వనమహోత్సవం కార్యక్రమాల ద్వారా నాటుతున్న మొక్కలను సంరక్షించాలి. మొక్కల నిర్వహణలో చిత్తశుద్ధి లేకపోతే అది సాధ్యం కాదు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని కాపాడటంలోనూ ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి.
– లక్ష్మయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
నిర్లక్ష్యం వద్దు..
హరితహారం, వనమహోత్సవ కార్యక్రమాల్లో నాటిన మొక్కల సంరక్షణకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని ఆయా శాఖల అధికారులకు సూచించాం. సర్వైవల్ పర్సెంటేజీని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా లోపాలుంటే సంబంధిత అధికారులకు సూచిస్తాం.
– సత్యనారాయణ, జిల్లా అటవీ శాఖాధికారి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటి అడవుల శాతం పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నర్సరీల్లో లక్షలాది మొక్కలు పెంచి.. వర్షాలు పడిన వెంటనే నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతారు. ఇలా నాటిన మొక్కలకు ప్రతి సంవత్సరం సర్వైవల్ తనిఖీలు చేయడంతోపాటు ప్లాంటేషన్ స్థలాలను సైతం మొక్కల జియోట్యాగింగ్ చేస్తారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, లెక్కలేనితనం మూలంగా ప్రభుత్వ ఆశయం అభాసుపాలవుతోంది. గత పదేళ్ల కాలంలో జిల్లాలో హరితహారం, వనమహోత్సవ కార్యక్రమాల ద్వారా ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో దాదాపు 7,61,62,084 మొక్కలు నాటగా.. నిర్వహణ లోపంతో దాదాపు 30 శాతం వరకు మొక్కలు బతకడం లేదు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన ఆయా ప్రభుత్వ శాఖలు నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి కూడా నాటడంలోనూ పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు.
మూడు శాఖల ఆధ్వర్యంలో..
జిల్లాలో ప్రధానంగా మూడు ప్రభుత్వ శాఖల పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని నర్సరీలు ఏర్పాటు చేస్తారు. అటవీ, మున్సిపాలిటీ, గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఓ)ల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి వాటిలో ఎవెన్యూ ప్లాంటేషన్, ఇంటి పరిసరాలు, పొలం గట్లు, అటవీ ప్రాంతంలో, చెరువు కట్టలు, శిఖం భూములు, ప్రభుత్వ భూముల్లో విరివిగా నాటేందుకు రకరకాల మొక్కలు పెంచుతారు. అయితే ఆయా నర్సరీల్లో నిర్ణీత సైజులో మొక్కలు పెరగకపోడం, రోజుల తర్వాత నాటడంతో అవి సరిగా బతకక ఎండిపోయి కనిపిస్తున్నాయి. కాగా.. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను సందర్శించి ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటేలా చర్యలు తీసుకోవాలి. కానీ, ఒక్కసారి మొక్కలు నాటిన తర్వాత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది.
సోషల్ ఆడిట్‌లో వెలుగులోకి..
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేయడం, దానికి తగ్గట్టుగా మొక్కలు నాటడం ప్రధాన అంశంగా పెట్టుకున్నారు. కూలీల ద్వారా గుంతలు తవ్వించడం, నాటడంతోపాటు గ్రామ పంచాయతీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. రెండేళ్లపాటు నిర్వహణ కోసం ప్రతినెలా నీళ్ల ట్యాంకర్‌కు కిరాయి చెల్లిస్తారు. అయితే ఈ డబ్బులు ఆరేడు నెలలకోసారి రావడంతో మొక్కల నిర్వహణపై నిర్లక్ష్యం ఆవహించింది. ఇటీవల జిల్లాలో నిర్వహించిన మూడు మండలాల సోషల్ ఆడిట్‌లోనూ ఇదే విషయం బయటపడటం గమనార్హం.
జిల్లా భౌగోళిక విస్తీర్ణం 2,73,796 హెక్టార్లు
ఇందులో అడవులు 22,869 హెక్టార్లు
ఇప్పటి వరకు
నాటిన మొక్కలు 7,61,62,084
ఈసారి నాటనున్న మొక్కలు
58 లక్షలు
ఇప్పటి వరకు నాటిన వాటిలో
30 శాతం వరకు వృథా
మొక్కలు నాటేందుకే
పరిమితమవుతున్న యంత్రాంగం
పచ్చదనంలోనూ దర్శనమిస్తున్న
ఎండిన మొక్కలు
నిర్వహణ లోపంతో ఎదుగుదల కోల్పోయి కునారిల్లుతున్న వైనం
డబ్బుల విడుదలలో ఆలస్యం..
రైతులు పొలం గట్లపై, బ్లాక్ ప్లాంటేషన్లు చేసుకున్న వాటికి సంబంధించి నిర్వహణ కోసం ప్రతినెలా మొక్కకు రావాల్సిన డబ్బుల విడుదలలో ఆలస్యం, గ్రామ పంచాయతీల పరిధిలో నాటే మొక్కలకు నిర్వహణ డబ్బులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంతో నిర్వహణకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ డబ్బుల విడుదలలో అలసత్వం సర్వైవల్ పర్సంటేజీ పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.

నిలువెత్తు నిర్లక్ష్యం

నిలువెత్తు నిర్లక్ష్యం

నిలువెత్తు నిర్లక్ష్యం

నిలువెత్తు నిర్లక్ష్యం

నిలువెత్తు నిర్లక్ష్యం

నిలువెత్తు నిర్లక్ష్యం