
ఉత్సాహంగా నెట్‌బాల్ సెలక్షన్స్ ట్రయల్స్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పురుష, మహిళా జట్ల సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించారు. 5 విభాగాల్లో ఎంపికలకు గాను 94 మంది పురుషులు, 64 మంది మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం నమక్కల్‌లో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే 17వ సౌత్‌జోన్ నేషనల్ నెట్‌బాల్, 18, 19 తేదీల్లో జరిగే 2వ ఫాస్ట్ 5 సౌత్‌జోన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్, 19, 20 తేదీల్లో జరిగే మొదటి సౌత్‌జోన్ నేషనల్ మిక్స్‌డ్ పోటీలు, హర్వానా రాష్ట్రం పల్వాల్‌లో వచ్చేనెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే 4వ ఫాస్ట్5 సీనియర్ నేషనల్ నెట్‌బాల్, 2వ సీనియర్ నేషనల్ మిక్స్‌డ్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే పురుషుల, మహిళా జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా నెట్‌బాల్ అసోసియేషన్ ఆప్ తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న జాతీయస్థాయి టోర్నమెంట్‌ల్లో రాష్ట్ర జట్లు మెరుగైన ప్రతిభకనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు రాంమోహన్‌గౌడ్, ఖాజాఖాన్, సయ్యద్ అంజద్‌అలీ, సీనియర్ క్రీడాకారులు అక్రం, ముంతాజ్, షరీఫ్ పాల్గొన్నారు.
ఐదు విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక