
ఒడిశా టు పాలమూరు
మహబూబ్‌నగర్ క్రైం: ‘గంజాయి విక్రయదారులు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు.. చాక్లెట్లు, సిగరెట్, ఆయిల్ రూపంలో ఇలా భిన్నంగా ఆలోచిస్తూ మత్తును చేరవేస్తున్నారు. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటుపడిన యువత బయటకు రావడం చాలా కష్టంగా మారుతోంది. చివరికి దాడులు చేసుకోవడం, ఇతర నేరాలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. బాధితుల్లో 18 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం విచారకరం.
గ్రాముల చొప్పున విక్రయం..
ప్రధానంగా పాలమూరుకు సరఫరా అవుతున్న ఎండు గంజాయిలో అధిక శాతం ఒడిశా నుంచి వస్తుంటే.. మరికొంత హైదరాబాద్‌లోని ధూల్‌పేట్ నుంచి వస్తోంది. దీనిని ఒక కేజీ గంజాయిని రూ.10 వేలకు కొనుగోలు చేసి.. దాంట్లో నుంచి ఐదు నుంచి ఆరు గ్రాములను ఒక పాకెట్‌గా ఏర్పాటు చేసి రూ.500 నుంచి రూ.700లకు విక్రయిస్తున్నారు. పోలేపల్లి సెజ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో పని చేసే ఒడిశాకు చెందిన కూలీలు కొంత రవాణా చేస్తుంటే దీని సరఫరాను అడ్డుకోవడానికి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కళాశాలలు, కాలనీల్లో విద్యార్థులు, యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరిస్తున్నారు.
బానిస కావాల్సిందే..
ఎవరైనా మత్తు పదార్థాలకు ఒక్కసారి అలవాటుపడితే వాటి నుంచి దూరం కావడం అసాధ్యం. ఆ మత్తుకు అలా బానిస కావాల్సిందే. కేవలం మత్తును ఆస్వాదించడం కోసమే వినియోగించే డ్రగ్స్‌ను ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసే సమయంలో రోగులకు నొప్పి తగ్గడానికి వైద్యులు అవసరమైన మోతాదులో రోగులకు ఇస్తుంటారు. ఇలాంటి డ్రగ్స్‌ను అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించడంతోపాటు నిత్యం కావాలనిపిస్తుంది. ఇలాంటి మత్తును రుచి చూసిన వారు జీవితాంతం కావాలని కోరుకుంటారు. ఇలాంటి మత్తు ఇంజెక్షన్ల వల్ల పూర్తిగా నరాల వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే మత్తు అత్యవసరమైన సమయంలో అందుబాటులో లేకపోతే విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అవకాశం లేకపోలేదు.
ధూల్‌పేట నుంచి యథేచ్ఛగా గంజాయి సరఫరా
కట్టడి చేయడంలో పోలీస్, ఎకై ్సజ్ అధికారుల విఫలం
మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత
ఇటీవల పాలమూరులో పెరిగిన కత్తులతో దాడులు
బాధితుల్లో 18 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికం