
సకల కార్మికులంతా నేటి సమ్మెలో పాల్గొనాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: అన్ని రంగాల్లో పని చేస్తున్న కార్మికులంతా బుధవారం నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెకు సంబంధించిన ఆటో జాతాను మంగళవారం ప్రారంభించారు. టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్, టీఎన్‌టీయూసీ జిల్లా నాయకులు డి.రాములు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎ.రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు హక్కులను హరించేందుకు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చారని ఆరోపించారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్మికుల వాయిస్‌ను ప్రభుత్వాలకు వినపడేలా గర్జించాలని సూచించారు.