
అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానికహౌసింగ్ కాలనీ, శ్రీనివాస కాలనీలను మంగళవారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరిశీలించారు. ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలపై స్థానికులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 60డివిజన్లలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు త్వరలో నిధులు రానున్నాయన్నారు. వీటికి సంబంధించి ఈపాటికే ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆస్తిపన్ను, నల్లా బిల్లులలో ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించాలని ప్రజలకు సూచించారు. హౌసింగ్ బోర్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. శ్రీనివాసకాలనీలోని చిక్కుడు వాగు పెద్దకాల్వను పటిష్టం చేయాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ వజ్రకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.