
భారీ కొండచిలువ పట్టివేత
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామ శివారులోని శంకరసముద్రం రిజర్వాయర్ ప్యాకేజీ– 19 కెనాల బ్రిడ్జి సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. మరమ్మతు పనులు చేపడుతున్న కూలీలు కొండచిలువను గుర్తించి అధికారులకు తెలుపగా వారు స్నేక్ క్యాచర్ కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. అతి కష్టం మీద పొక్లెయిన్ సాయంతో కొండచిలువను పట్టుకున్నారు. కొండచిలువ 22 కేజీల బరువు, 3.5 మీటర్ల పొడవు ఉందని, సమీప అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్టు కృష్ణసాగర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలుక కుమార్‌సాగర్, ధనుంజయ్, మన్యం తదితరులు పాల్గొన్నారు.