
పెద్దసారు కుర్చీ ఖాళీ!
మహబూబ్‌నగర్ జిల్లా
కేంద్రంలోని జిల్లా
రిజిస్ట్రార్ కార్యాలయంలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీ
జిల్లా రిజిస్ట్రార్
కార్యాలయం
మెట్టుగడ్డ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కేంద్ర బిందువు, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయమైన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రారు కుర్చీ ఖాళీగా దర్శనమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం అందించే కార్యాలయాల్లో ఒకటి. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్‌తోపాటు నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడ్డా కూడా జిల్లాకో రిజిస్ట్రార్‌ను నియమించాల్సి ఉండగా.. ఏ ఒక్కరినీ నియమించలేదు. ఉమ్మడి జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకూ ఒక్కరే కొనసాగుతూ వచ్చారు. అయితే ఇక్కడ పనిచేసే రిజిస్ట్రార్ రవీందర్ గతనెల 30న ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. రోజుకు లక్షల్లో ఆదాయం అందించే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై పర్యవేక్షణ లేకుంటే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. కావున ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చినా చెప్పుకునే అధికారి లేకపోతే ఎవరికి విన్నవించుకోవాలని, వెంటనే జిల్లాకు రిజిస్ట్రార్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కొసమెరుపు ఏంటంటే ఉద్యోగ విరమణ చేసిన అధికారి పేరు ఇంకా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని సమాచార హక్కు చట్టం బోర్డులో అలాగే కొనసాగడం విశేషం.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నియామకం కాని అధికారి
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఖాళీ కుర్చీలే..

పెద్దసారు కుర్చీ ఖాళీ!