
ఎక్కడెక్కడ అంటే..?
కొత్తగా వెలిసిన ఏనుగొండలోని పోచమ్మకాలనీ, సగర కాలనీ, శ్రీరామకృష్ణా కాలనీ, ద్వారకాపురి కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, మర్లులోని శాంతినగర్, విఘ్నేశ్వర కాలనీ, ఎస్‌ఆర్ నగర్, శ్రీరామ కాలనీలలో సగం వరకు డ్రెయినేజీలు నిర్మించలేదు. క్రిస్టియన్‌పల్లి, ఏనుగొండలోని బీసీ కాలనీ, ఎస్సీకాలనీ, పద్మావతికాలనీ ఎస్‌బీఐ బ్రాంచికి ఎదురుగా ఉన్న వీధిలో, పాత పాలమూరులోని హరిజనవాడ, దోబీవాడ, గోల్ మసీదు ప్రాంతంలోని గచ్చిబౌలి, కురిహినిశెట్టికాలనీతో పాటు కిసాన్‌నగర్, వీరన్నపేట, ఝాన్సీనగర్, హనుమాన్‌నగర్, న్యూగంజ్, కొత్తచెరువు రోడ్, మోతీనగర్, బోయపల్లి, గొల్లబండ తండాలలో పాత డ్రెయినేజీలు దెబ్బతిన్నాయి.