
పాముల భయం ఉంది
మా వీధిలో డ్రెయినేజీ, సీసీ రోడ్డు నిర్మించకపోవడంతో చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్లలో మురుగు చేరి దుర్గంధం వెదజల్లుతోంది. ముఖ్యంగా దోమలు, ఈగలు ముసురుకుంటున్నాయి. మా ఇంట్లోని ఇద్దరు చిన్నపిల్లలను బయటకు తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఇటీవల పొదలలో నుంచి మా ఇంటి వద్ద మట్టిరోడ్డు పైకి ఓ పాము వచ్చిపోయింది. కుటుంబసభ్యులందరమూ ఎంతో ఆందోళనకు గురయ్యాం. చివరకు మున్సిపల్ జవాన్‌కు చెప్పి పారిశుద్ధ్య కార్మికులతో పొదలు తొలగించి మోరీని శుభ్రం చేయించాం.
– ప్రతిభ, గృహిణి, విఘ్నేశ్వరకాలనీ, మహబూబ్‌నగర్