
డ్రెయినేజీ నిర్మించాలి
పద్మావతికాలనీలోని అయ్యప్పగుట్టకు వెళ్లే మార్గంలో 20 ఏళ్ల క్రితమే ఇళ్లు నిర్మించుకున్నాం. ఇప్పటివరకు అధికారులు అధికారులు ఈ గుట్ట ప్రాంతంలో సీసీరోడ్డు, డ్రెయినేజీ ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టి రోడ్లపై వరద కొట్టికొచ్చి పాయలుగా మారుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఆస్కారం లేకుండాపోయింది. కనీసం నడవడానికి కూడా వీలులేదు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదు.
– పగడం మల్లేష్, అయ్యప్పగుట్ట ప్రాంతం, మహబూబ్‌నగర్