జూరాలకు జలసిరి | - | Sakshi
Sakshi News home page

జూరాలకు జలసిరి

Jun 28 2025 5:29 AM | Updated on Jun 28 2025 8:49 AM

జూరాలకు జలసిరి

జూరాలకు జలసిరి

ధరూరు/ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో ఇన్‌ఫ్లో మరింత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం ప్రాజెక్టుకు 98వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో లక్షా 5వేల క్యూసెక్కులకు పెరిగిందని పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 12క్రస్టు గేట్లను ఎత్తి 85, 268 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27,532 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరిరూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 150 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,14,469 క్యూసెక్కులను దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.

వేగవంతంగా విద్యుదుత్పత్తి

దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈమేరకు శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 64.680 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 74.613 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 139.293 ఎంయూ విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 28 వేల క్యూసెక్కులను వినియోగించి విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని, దిగువన శ్రీశైలంకు నీటిని వదులుతున్నామని తెలిపారు.

శ్రీశైలంకు 1,08,325 క్యూసెక్కులు

దోమలపెంట: జూరాల స్పిల్‌వే, విద్యుదుత్పత్తి చేస్తూ మొత్తం 1,08,325 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌ జలాశయంకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 865.7 అడుగుల నీటిమట్టం, 125.1322 టిఎంసీల నీటి నిల్వ ఉంది. 24గంటల వ్యవధిలో రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 1,072 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

జూరాల ప్రాజెక్టు వద్ద 12 క్రస్టు గేట్ల నుంచి

దిగువకు విడుదలవుతున్న వరద నీరు

లక్షా5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత

కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

దిగువకు 1,14,469 క్యూసెక్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement