
మనిషి మస్తిష్కానికి పుస్తకమే ఆయుధం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మనిషి సర్వతోముఖాభివృద్ధికి చదువు ఎంతో ముఖ్యమని, అక్షరాలను పొదిగిన మంచి పుస్తకాలే మనిషి మస్తిష్కానికి ఆయుధాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. పుస్తకం ఔన్నత్యం, చదువు విశిష్టతను తెలుపుతూ నంచర్ల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల సంగీత ఉపాధ్యాయిని శ్యామల రచన గానంతో రూపొందించిన ‘పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట’ అనే ఆడియో, వీడియో ఆల్బమ్‌ను బుధవారం తన చాంబర్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో విద్యార్థులు, యువత పుస్తకం విస్మరిస్తూ సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో యువత అప్రమత్తంగా ఉండి ఉన్నత లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని సూచించారు. శ్యామల పాటలు సామాజిక స్పహ నింపుతున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాధ, పంచాయతీ కార్యదర్శి నర్మద, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొండికంటి పద్మావతి, జనార్దన్, రామచందర్, రణధీవ్, కృష్ణ, దేవానంద్, శిరీష, సింధు, స్ఫూర్తి పాల్గొన్నారు.