
జడ్చర్ల టు నంద్యాల
మరోసారి తెరపైకి రైల్వేట్రాక్ ప్రతిపాదన!
●
ట్రాఫిక్ తక్కువగా ఉందని
జడ్చర్ల–నంద్యాల రైల్వేలైన్ కోసం 2005–06లో చేసిన సర్వేలో ట్రాఫిక్ తక్కువగా ఉందని, రేట్ ఆఫ్ రిటర్న్ 10శాతం తక్కువగా ఉండటం వల్ల ప్రతిపాదనలు ఆగిపోయాయి. ఇప్పుడు జనాభా రెంట్టింపు కావడంతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు ఆర్‌ఓఆర్ పెరిగే ఆస్కారం ఉంది. అందుకే ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశాం. ఎంపీ సానుకూలంగా స్పందించారు. జడ్చర్ల–నంధ్యాల రైల్వేలైన్ అయితే జడ్చర్ల జంక్షన్‌గా మారేందుకు ఆస్కారం ఉంది.
– కంచుకోట ఆనంద్,
సామాజిక వేత్త, బాదేపల్లి
ఎంపీని కలిసి విన్నవిస్తాం
జడ్చర్ల–నంద్యాల రైల్వేలైన్ ప్రతిపాదనలతో ఎంపీ డీకే అరుణను కలసి విన్నవిస్తాం. జడ్చర్ల నుంచి నాగర్‌కర్నూలు, కృష్ణానది మీదుగా బండి ఆత్మకూర్ ద్వారా నంధ్యాల వరకు రైల్వేలైన్ వేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రైల్వేలైన్ మంజూరైతే జండ్చర్ల రైల్వేస్టేషన్ జంక్షన్‌గా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం కలుగుతుంది. కేంద్రంలో మా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున రైల్వేలైన్ సాధించేందుకు కృషిచేస్తాం.
– బాలవర్ధన్‌గౌడ్, బీజేపీ అధికార ప్రతినిధి, జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల టౌన్: అన్నిరంగాల్లోనూ దినదినాభివృద్ధి చెందుతున్న జడ్చర్ల పట్టణం నుంచి నంద్యాల వరకు నూతన రైల్వేలైన్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ మేరకు ఇటీవల స్థానికులు కొందరు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందించగా.. ఆమె సానుకూలంగా స్పందించడం గమనార్హం. వాస్తవానికి 2005–06లో అప్పటి రైల్వేశాఖ మంత్రి లాలుప్రసాద్ జడ్చర్ల–నంధ్యాల రైల్వేలైన్ సర్వేకు రూ.10కోట్లు కేటాయించారు. సర్వే నిర్వహించినప్పటికీ ప్రతిపాదనలు ఎందుకు మూలనపడ్డాయో తెలియకుండా పోయింది. అన్నీ ఆశించినట్లు జరిగితే రైల్వేలైన్ మంజూరైతే ఈ ప్రాంతం నుంచి కడప, తిరుపతి, చైన్నె వెళ్లేవారికి దూరం తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతుంది. సర్వే అనంతరం రేట్ ఆఫ్ రిటర్న్ లేనందున ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉంచినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది.
2005లో సర్వేకు రూ.10కోట్ల
కేటాయింపు
నాగర్‌కర్నూలు వయా బండి ఆత్మకూర్ మీదుగా..
182 కి.మీ.కు రూ.565కోట్ల
వ్యయం అంచనా
అప్పట్లో ఆర్‌ఓఆర్ తక్కువని
మూలన పడిన వైనం

జడ్చర్ల టు నంద్యాల