
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఉప్పునుంతల: విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని కంసానిపల్లిలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన మదనాగుల శేఖర్ (27) విద్యుత్ దినసరి కూలీగా పని చేస్తుండేవాడు. కంసానిపల్లి ఫీడర్‌లో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌కు కొంతకాలం కిందట కాలు విరగడంతో ఇటీవలే విధుల్లో చేరారు. బుధవారం కంసానిపల్లి ఫీడర్ బ్రేక్‌డౌన్ కావడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దానిని సరిచేయడానికి లైన్‌మెన్ వెంకటేష్ ఉప్పునుంతలకు చెందిన శేఖర్‌ను వెంట తీసుకువెళ్లాడు. శేఖర్ స్తంభంపైకి ఎక్కి తీగలను సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి తగిన సాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉప్పునుంతల సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి వారికి సర్ధిచెప్పి పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. గ్రామపెద్దలు అనంతరెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు ఇన్‌చార్జ్ ఏడీఈ ఆంజనేయులు, ఏఈ కొండలు, సిబ్బందితో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా రాజీ కుదిర్చారు. అనంతరం మృతదేహాన్ని స్తంభంపైనుంచి కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శేఖర్‌కు భార్య లావణ్య, రెండేళ్ల కుమారుడు ఉండగా.. ప్రస్తుతం గర్భంతో ఉంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన

విద్యుదాఘాతంతో యువకుడి మృతి