
నల్లమలలో ట్రెయినీ ఐఏఎస్‌లు
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 2024 బ్యాచ్ ఐఏఎస్‌లు సందర్శించారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ట్రెయినీ ఐఏఎస్‌లు సౌరబ్ శర్మ, సలోనీ చాబ్రా, హర్ష చౌదరి, ఖర్లాన్ చిగ్తి యాన్వీ, ప్రణయ్‌కుమార్ సందర్శించి.. నల్లమల అభయారణ్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అటవీశాఖ చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. అదే విధంగా పులుల సంరక్షణ, చెంచుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. ప్రకృతి ప్రియుల కోసం నిర్వహిస్తున్న సఫారీతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం లోతట్టు మారుమూల ప్రాంతాలైన సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల్లో ట్రెయినీ ఐఏఎస్‌లు పర్యటించినట్లు సంస్థ నోడల్ అధికారి డా.శ్రీనివాస్ తెలిపారు. వారి వెంట ఎఫ్‌ఎస్‌ఓ శ్రీకాంత్, బయోలజిస్టు మహేందర్ ఎఫ్‌బీఓలు మధుసూదన్, శివ తదితరులు ఉన్నారు.