Telangana News: TS Special: కాంగ్రేస్‌ పార్టీ ప్రకటించిన.. గెలుపు గుర్రాలు వీరే..
Sakshi News home page

TS Special: కాంగ్రేస్‌ పార్టీ ప్రకటించిన.. గెలుపు గుర్రాలు వీరే..

Oct 28 2023 1:10 AM | Updated on Oct 28 2023 9:07 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ – నియోజకవర్గం
పేరు : యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,
తండ్రి పేరు : యెన్నం జానకిరాంరెడ్డి
భార్య : ప్రసన్నారెడ్డి. పిల్లలు: ఆర్నవ్‌, అక్షర
స్వస్థలం : వెల్దండ
పుట్టిన తేదీ : 03.01.1970
విద్యార్హత : ఎంబీఏ, ఎంఏ, ఉస్మానియా యూనివర్సిటీ.
రాజకీయ నేపథ్యం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి 2001లో రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ మద్దతుతో 2007లో మహబూబ్‌నగర్‌–హైదరాబాద్‌– రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2007– 2009 టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2009లో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీచేసినప్పుడు ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.

2009లో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. యువ తెలంగాణ జేఏసీ ఫౌండర్‌గా పనిచేశారు. 2012లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎర్రశేఖర్‌కు మద్దతు తెలిపారు. తిరిగి 2019 నుంచి 2023 వరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు.

జడ్చర్ల – నియోజకవర్గం
పేరు :
జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి
తండ్రి : జనుంపల్లి దిలీప్‌రెడ్డి తల్లి : శశికళారెడ్డి
భార్య : మంజూష గంగారం
స్వగ్రామం : రంగారెడ్డిగూడ, రాజాపూర్‌ మండలం
చదువు : బీటెక్‌ పుట్టిన తేదీ : 31.12.1980
రాజకీయ అరంగ్రేటం : 2012లో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2017లో కాంగ్రెస్‌లో చేరి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తల్లి శశికళారెడ్డి రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.

నారాయణపేట – నియోజకవర్గం 
పేరు : చిట్టెం పర్నీకారెడ్డి
పుట్టిన తేదీ : 20.08.1993
చదువు : ఎంబీబీఎస్‌ (ఎండీ రేడియాలజిస్ట్‌)
తండ్రి : దివంగత చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి
తల్లి : చిట్టెం లక్ష్మి ఐఏఎస్‌ (రాష్ట్ర అడిషనల్‌ కార్యదర్శి సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్‌మెంట్‌)
రాజకీయ నేపథ్యం : మొదటి నుంచి చిట్టెంది రాజకీయ కుటుంబమే. వారి కుటుంబమంతా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగింది. దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనువరాలు. తండ్రి దివంగత చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడు. మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డి డీసీసీ మాజీ అధ్యక్షుడు.

మక్తల్‌ –నియోజకవర్గం
పేరు : వాకిటి శ్రీహరి
పుట్టిన తేదీ : 01.11.1972
తల్లిదండ్రులు : వాకిటి రాములమ్మ, నర్సింహులు
భార్య : లలిత
పిల్లలు : అచ్యుత్‌రాం, అమిత్‌సాయి
రాజకీయ నేపథ్యం : 1996 నుంచి 2001 వరకు కాంగ్రెస్‌ పార్టీ మక్తల్‌ మండల కాంగ్రెస్‌ కార్యదర్శిగా పనిచేశారు. 2001 – 2006లో మక్తల్‌ మేజర్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2014 – 2018 వరకు మక్తల్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై .. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరించారు. 2014 – 2018 జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2022 నుంచి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

వనపర్తి – నియోజకవర్గం 
పేరు : జిల్లెల చిన్నారెడ్డి
పుట్టిన తేదీ : 01.06.1955
స్వగ్రామం : జయన్న తిరుమలాపురం, గోపాల్‌పేట మండలం, తల్లిదండ్రులు : పాపిరెడ్డి, దుర్గమ్మ
భార్య : రమాదేవి, పిల్లలు : ఆదిత్యరెడ్డి, అనురాగ్‌రెడ్డి
విద్యార్హత : ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ (అగ్రికల్చర్‌), ఎల్‌ఎల్‌బీ
రాజకీయ నేపథ్యం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికై .. యూత్‌ కాంగ్రెస్‌ కోటాలో మొదటిసారి 1985లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

1989లో రెండోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఓటమి, 1999, 2004లో వరుసగా రెండుసార్లు గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు. 2009లో ఓటమి, 2014లో గెలుపొందారు. 2018లో ఓటమిపాలయ్యారు.

దేవరకద్ర – నియోజకవర్గం
పేరు : గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి
పుట్టిన తేదీ : 04.05.1971
విద్యార్హత : బీఏ, ఎల్‌ఎల్‌బీ
భార్య : కవిత
స్వగ్రామం : దమగ్నాపూర్‌, చిన్నచింతకుంట మండలం
రాజకీయ నేపథ్యం : న్యాయవాది వృత్తిలోనే కొనసాగుతూ జీఎంఆర్‌ సేవా సమితి పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2022 నుంచి మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement