
నిర్వాసిత రైతులతో మాట్లాడుతున్న ఆకునూరి మురళి
గట్టు: చిన్నోనిపల్లె ప్రాజెక్టు ఫెయిల్యూర్ అని ఏ మాత్రం అవగాహన, ఆయకట్టు లేకుండా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి రైతులను నిండా ముంచుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. శుక్రవారం చిన్నోనిపల్లె రిజర్వాయర్ రద్దు కోసం చేస్తున్న ఆందోళన శిబిరాన్ని ఆయనతో పాటు ఎస్‌డీఎఫ్ కో కన్వీనర్ పృథ్వీరాజ్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్‌కుమార్ సందర్శించి సంఘీభావం తెలియజేశారు. రిజర్వాయర్ ద్వారా ఇక్కడి రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. ఆయకట్టు లేకుండా నిర్మాణం చేపట్టడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. 17 ఏళ్లుగా రిజర్వాయర్‌ను అసంపూర్తిగా వదిలేసినట్లు ఆరోపించారు. అవసరం లేని రిజర్వాయర్‌ను రద్దు చేసి, సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ ఐఏసీ అధికారి ఆకునూరి మురళి