ప్రీ ప్రమోషనల్‌ శిక్షణను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రమోషనల్‌ శిక్షణను వినియోగించుకోవాలి

Feb 17 2026 8:41 AM | Updated on Feb 17 2026 8:41 AM

ప్రీ ప్రమోషనల్‌ శిక్షణను వినియోగించుకోవాలి

ప్రీ ప్రమోషనల్‌ శిక్షణను వినియోగించుకోవాలి

మామునూరు : పదోన్నతి కోసం ఆర్ముడ్‌ రిజర్వ్‌ పోలీసులకు నిర్వహించే రీపీ ప్రమోషనల్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌ కమాండెంట్‌ డి. శివప్రసాద్‌రెడ్డి సూ చించారు. మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటా లియన్‌లో తెలంగాణ విభాగం ఆర్ముడ్‌ రిజర్వ్‌కు చెందిన 244 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు రెండు వారాల పాటు, 52 మంది రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు 4వారాల పాటు నిర్వహించే ఫ్రీ ప్రమోషన్‌ శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్ముడ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లు హెడ్‌ కానిస్టేబుళ్లుగా.. హెడ్‌కానిస్టేబుళ్లు అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా.. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందడానికి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ప్రతీ అభ్యర్థి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏసీ కృష్ణప్రసాద్‌, వీరన్న ఆర్‌ఐలు కార్తీక్‌, రవి, రాజిరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, కృష్ణ, మెడికల్‌ ఆఫీసర్‌ శిరీష, శ్రవణ్‌ పాల్గొన్నారు.

టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌

కమాండెంట్‌ శివప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement