సమాజంలో పోలీసుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సమాజంలో పోలీసుల పాత్ర కీలకం

Feb 17 2026 8:41 AM | Updated on Feb 17 2026 8:41 AM

సమాజంలో పోలీసుల పాత్ర కీలకం

సమాజంలో పోలీసుల పాత్ర కీలకం

25నుంచి నుంచి పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

పీటీసీ ప్రిన్సిపాల్‌ రమేశ్‌

మామునూరు : సమాజంలో పోలీసుల పాత్ర కీలకమని, కాలానికి అనుగుణంగా వస్తున్న నూతన చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలని పోలీస్‌ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ రమేశ్‌ సూచించారు. మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాలలో రాష్ట్రంలోని 840 మంది కానిస్టేబుళ్లకు సోమవా రం పదోన్నతి శిక్షణ ప్రారంభమైంది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కానిస్టేబుళ్లు డిజిటల్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ఆరోగ్యంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. శిక్షణ కాలాన్ని వృథా చేయకుండా ప్రతీ అంశంపై పట్టుసాధించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్‌, వెంకటేశ్వరరావు, సోమాని, మెడికల్‌ ఆఫీసర్‌ సురేశ్‌, ఆర్‌ఐఏ చంద్రశేఖర్‌, నవీన్‌, మహేశ్‌, నరేశ్‌, సీఎల్‌ఐలు రామ్మూర్తి, నరేందర్‌, అశోక్‌, దీపక్‌, రాజ్యలక్ష్మి, మంగమ్మ, షర్మిల, ప్రవళిక, విద్యాసాగర్‌, అరుణ, రాజేశ్‌, అనిల్‌, బాపురెడ్డి, సుధాకర్‌, ఫార్మసీ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, పీఆర్‌ఓ రామాచారి, తదితరులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంహెచ్‌ఆర్‌ఎం, లైబ్ర రీ సైన్స్‌ తదితర పీజీ కోర్సుల రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు ఈనెల 25నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌,అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి. శ్రీనివా స్‌ పరీక్షల టైంటేబుల్‌ విడుదల చేశారు. ఈనెల 25, 27, మార్చి 2, 5, 7, 9తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఫుట్‌బాల్‌ విజేత వరంగల్‌ జట్టు

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్‌ కలాం స్డేడియంలో కాలనీ ఫుట్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బా ల్‌ టోర్నమెంట్‌లో వరంగల్‌ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో హుజూరాబాద్‌పై వరంగల్‌ జట్టు రెండు గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. విజేతకు కప్పుతోపాటు రూ.2వేల నగదు బహుమతి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement