ఓటేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
చిన్నగూడూరు: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సొంత గ్రామమైన మంచ్యాతండాలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంచ్యాతండా రైతువేదికలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇటీవలే ప్రత్యేక జీపీగా ఏర్పడిన మంచ్యాతండాకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి.
గార్లలో ఓటు వేసిన సీఐటీయూ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గార్ల: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆదివారం గార్లలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశారు. ఈసందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతీఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
రీకౌంటింగ్ చేయాలని ఆందోళన
బయ్యారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రెండో విడత ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుదారు గుగులోతు శాంతి మూడు ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అత్యల్ప తేడా రావడంతో ప్రత్యర్థి మరోసారి కౌంటింగ్ చేయాలని కోరారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉధ్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి 12 దాటినా ఆందోళన కొనసాగింది. పోలింగ్ అధికారులు సైతం కేంద్రంలోనే ఉన్నారు.
పాలడుగు భాస్కర్


