‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటి న తర్వాత సభలు, సమావేశాలు, మైక్‌లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


