వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది.
సమస్యల స్వాగతం..
పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు.
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి
సంఘాలు
నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి
ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు విద్యార్థి
సంఘాల డిమాండ్
‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన
ఉన్నతాధికారులు
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం


