14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్‌షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్‌లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు.


