లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
సీటు వస్తే నవోదయమే..
మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.
నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష
ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు
పరీక్ష కేంద్రానికి గంట ముందే
అనుమతి
పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది


