కుక్కల దాడిలో గొర్రెల మృత్యువాత
మహబూబాబాద్ రూరల్: కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాతపడిన సంఘటన మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కంబాలపల్లి గ్రామాని కి చెందిన కప్పల శ్రీను తన గొర్రెలు, వాటి పిల్లల ను ఇంటి ఆవరణలోని దొడ్డిలో కట్టి ఉంచారు. అర్ధరాత్రి దాటాక కుక్కలు ఒకసారిగా దొడ్డిలోకి దూకి మూడు పెద్ద గొర్రెలు, ఎనిమిది గొర్రె పిల్లలపై దాడి చేయగా అవి మృత్యువాతపడ్డాయి. దీంతో బాధితుడు కప్పల శ్రీనుకు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఈత చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
మరిపెడ రూరల్: ఈత చెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన పోగుల సత్యం (60) రోజూ మాదిరిగానే కల్లు గీయడానికి వెళ్లాడు. వనంలోని ఈత చెట్టు ఎక్కుతున్న క్రమంలో పట్టుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


