అక్క పేరుతో నమ్మించి దోచేశారు..
● సైబర్ వలలో మండల పరిషత్ ఉద్యోగి
● రూ.47 వేలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..
ఖానాపురం: సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేశారు. అత్యవసరంగా డబ్బులు కావాలని తన సోదరి (అక్క) పేరుతో మెసె జ్ పంపి రూ.47 వేలు కొల్ల గొట్టారు. వివరాలు ఇలా ఉ న్నాయి. ఖానాపురం మండ ల పరిషత్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ మహిపాల్ మంగళవారం విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరికి సంబంధించిన నంబర్ నుంచి మహిపాల్‌కు మెసెజ్ వచ్చింది. అత్యవసరంగా డబ్బులు కావాలని మెసెజ్‌లో ఉండడంతో మహిపాల్ వెంటనే 8085910355 నంబర్‌కు రూ.47వేలు ఫోన్‌పే ద్వారా పంపాడు. మరికొంత సమయం తర్వాత మరోసారి డబ్బులు కావాలని మెసెజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే సో దరి, బావకు ఫోన్ చేయగా సమాధానం లభించలే దు. దీంతో బ్యాంకుకు వెళ్లి ఖాతాలో నగదు బదిలీ కాకుండా నిలిపివేయించాడు. ఆ తర్వాత తన సో దరి ఫోన్ చేయడంతో విషయం తెలిసింది. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని సైబర్‌క్రైం అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కుటుంబ సభ్యుల నంబర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు పంజావిసురుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


