గోడ మీద రాతలేదు.. మైక్ మోత లేదు
కాజీపేట: ఒకప్పుడు స్థానిక ఎన్నికల్లో బరిలో ఉంటే వ్యక్తి తన ప్రచారాన్ని గోడల మీద రాతలతో ప్రారంభించేవాడు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ఎన్నికల అధికా రులు ఇచ్చే గుర్తులతో పోస్టర్లు అంటించడం, గోడల మీద గుర్తులను వేయడం, ఆటోల్లో ప్రచారం నిర్వహించేవారు. నేడు మారుతున్న కాలానుగుణ పరిస్థితుల నేపథ్యంలో పల్లె పోరులో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పో షిస్తున్నాయి. పోటీచేసే అభ్యర్థుల అనుచరులు, కుటుంబ సభ్యులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో మొదలు పెట్టి గ్రామానికి చేసే పనులు ఎజెండా, యువతకు చక్కటి సందేశాలను రూపొందించి సోషల్‌మీడియాలో పోస్టు చేయడం పల్లెల్లో చర్చనీయాంశంగా మారింది.
మారిన ఎన్నికల ప్రచార పర్వం..
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్


