సీఎం సభాస్థలి పరిశీలన
నర్సంపేట: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిపాడ్, బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం సీపీ సన్‌ప్రీత్‌సింగ్, డీసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. నర్సంపేట నుంచి సభా స్థలికి వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, శంకుస్థాపన చేసే ప్రాంతాల్లో పోలీసు అధికారులు ఉండాలని సూచించారు. అలాగే, కలెక్టర్ సత్యశారద మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్న బహిరంగ సభ, హెలి పాడ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీపీ పు న్నం రవీందర్‌రెడ్డి, ఎస్‌బీ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ము న్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, డాక్టర్ పులి అనిల్, నర్సంపే ట పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చై ర్మన్ ఎర్ర యాకూబ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలి, గంధం నరేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపిక శ్రావణ్‌కుమార్, మా జీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాల్వాయి రవికుమార్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్ పాల్గొన్నారు.


