33 పార్కింగ్ స్థలాలు
మేడారంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
1,462 ఎకరాలు..
ఖమ్మం, మణుగూరు, ఇల్లందు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటూరునాగారం నుంచి కొండాయి మీదుగా ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు ఊరట్టం చేరుకుని ఏ1 ఊరట్టం బసాగూడెం, ఏ2, ఏ3 ఊరట్టం పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేయనున్నారు.
కరీంనగర్, మంథిని, మహదేవపూర్, మహారాష్ట్ర, సిరోంచ, కాటారం నుంచి సింగారం, కాల్వపల్లి మీదుగా నూతనంగా నిర్మిస్తున్న కాల్వపల్లి నుంచి ఊరట్టం రోడ్డు మార్గాన బీ1 నుంచి బీ5 ఊరట్టం, సీ1, సీ2 , డీ1, డీ2 కన్నెపల్లి పార్కింగ్ స్థలాలకు మళ్లించనున్నారు.
హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా సీ1, సీ2, డీ1, డీ2 కన్నెపల్లి, ఈ1 జంపవాయి, ఈ2 మరసుర ఆర్‌ఎఫ్ పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లించనున్నారు.
హనుమకొండ నుంచి ఏటూరునాగారం ప్రాంతాల నుంచి వీవీఐపీల తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లి శివరాంసాగర్ చెరువు సమీపం నుంచి వీవీఐపీ రోడ్డు ద్వారా చిలకలగుట్ట పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లించనున్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు ములుగు జిల్లా పోలీసుశాఖ పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరుగనుంది. ఈసారి జాతరకు కోటిమందికిపైగా భక్తులు తరలివస్తారని అధికారుల అంచనా. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా భక్తుల ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు 1,462 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల్లో భక్తుల సౌకర్యార్థం విద్యుత్, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఈసారి అదనంగా పార్కింగ్ స్థలాలను పెంచేందుకు పోలీసులు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఈసారి జాతరలో కొంగలమడుగు ప్రాంతంలో 30 ఎకరాల్లో కొత్త ఎమర్జెన్సీ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు. జాతరకు భక్తులు ప్రైవేట్ వాహనాల్లో అంచనాకు మించి తరలివస్తే.. అత్యవసర సమయంలో వాహనాలను పార్కింగ్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, వీవీఐపీలు కూడా గతంలోకంటే ఈసారి జాతరకు ఎక్కువగా రానున్న సందర్భంగా చిలకలగుట్ట ప్రాంతంలో అదనంగా 150 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు.
కొంగలమడుగులో
అత్యవసర పార్కింగ్ స్థలం
అదనంగా 150 ఎకరాల్లో
వీవీఐపీ పార్కింగ్


