పది కంటెయినర్లలో అమెరికా బేళ్ల దిగుమతి
గీసుకొండ : వరంగల్ జిల్లాలోని కాకతీయ మె గా టెక్స్‌టైల్ పార్కులోని కై టెక్స్ కంపెనీ కోసం అమెరికా నుంచి పది కంటెయినర్ల లోడ్‌తో ఉన్న పత్తి బేళ్లు సోమవారం దిగుమతి అయ్యా యి. ఈ బేళ్లు అమెరికా నుంచి సముద్ర మార్గంగుండా ముంబైకి చేరుకున్నాయి. అక్కడి నుంచి ప్రత్యేక కంటెయినర్ల ద్వారా కేఎంటీపీకి తరలించారు. ఇప్పటికే కై టెక్స్ కంపెనీకి 13 కంటెయినర్లలో అమెరికా బేళ్లు దిగుమతి అయిన వి షయం తెలిసిందే. తాజాగా దిగుమతి అయిన ప్రతీ కంటెయినర్లో 150 బేళ్లు ఉన్నాయి.
ముగిసిన ఎడ్యుకేషనల్ టూర్
వరంగల్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధి వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గత నెల 21న ఎడ్యుకేషనల్ టూర్‌కు వెళ్లి సోమవారం నగరానికి తిరిగి వచ్చారు. దక్షిణ భారత విద్యాయాత్రలో భాగంగా నవంబర్ 22న చెన్నయ్‌లోని ఐసీఏఆర్–సీఐబీఏ, ఎన్‌ఐడబ్ల్యూడీ, 23న పాండిచ్చేరిలోని కేవీకే, మ్యూజియంను సందర్శించారు. 24న అబ్దుల్ కలాం స్మారక చిహ్నం, 26న అల్లెప్పీలోని ఐసీఏఆర్–కేంద్ర దినుసుల పంట పరిశోధన సంస్థ(ఏసీఏఆర్–సీటీసీఆర్‌ఐ)ను సందర్శించారు. 28న తమిళనాడులోని టీఎన్‌ఏయూ(తమిళనాడు అగ్రి కల్చర్ విశ్వవిద్యాలయం), ఎస్‌బీఐ (చెరుకు పెంపకం సంస్థ), సీఐసీఆర్‌ను సందర్శించారు. అక్కడి నుంచి 29న ఊటీలోని కర్ణాటక సిరి హార్టికల్చరల్ గార్డెన్, టీ ఫ్యాక్టరీని సందర్శించారు. చివరగా మైసూరులోని జాతీయ ఆహారశాస్త్రం, పరిశోధన సంస్థని సందర్శించి నూతన పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ఈ యాత్రలో 110 మంది విద్యార్థులు పాల్గొనగా . యాత్రను కళాశాలలోని అధ్యాపకులు శివకృష్ణ, రాంబాబు, ప్రగ్న, గోపిక పర్యవేక్షించారు.
అగ్రోనమీ కాంగ్రెస్‌లో
తెలంగాణకు గౌరవం
వరంగల్ : న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్, ఎన్‌పీఎల్‌లో నవంబర్ 24 నుంచి 26 వరకు నిర్వహించిన 6వ అంతర్జాతీయ అగ్రోనమీ కాంగ్రెస్ (ఐఏసీ–2025) లో వరంగల్ వ్యవసాయ కళాశాల లెక్చరర్ డా.బి.సిద్ధార్థనాయక్ రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. అదనంగా ఇ కాంగ్రెస్ సావెనీర్‌లో ఆయన సహరచనలోని అధ్యాయం మొదటి అధ్యాయంగా (చాప్టర్–1)ఎంపిక కావడం విశేషం. సామెనీర్‌లోని ‘రిమైజినింగ్ ఆగ్రోనోమీ టూ వార్డ్స్ రెసిలియేంట్ అగ్రి–ఫుడ్ సిస్టమ్స్’ అధ్యాయాన్ని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా.ఎం.ఎల్.జాట్, ఏఎస్‌ఏ అ ధ్యక్షులు డా.ఎస్‌కే.శర్మలతో కలసి డా.సిద్ధార్థనా యక్ రచించారు. ఈ అధ్యాయం అంతర్జాతీయ అగ్రోనమీ సమాజం నుంచి విశేషమైన ప్రశంసలు అందుకుంది.అవార్డులు అందుకున్న సిద్ధార్థ్‌నా యక్‌ను వ్యవసాయ కళాశాల వరంగల్ అసోసియేట్ డాక్టర్ రవీందర్‌నాయక్, అధ్యాపక బృందం. విద్యార్థులు అభినందించారు.
బ్రోచర్ ఆవిష్కరణ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో జాతీయ సదస్సు, పాపులిస్టు పాలసీస్ ఇన్‌పోస్టు లిబరలైజేషన్ ఇండియా అంశంపై జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ఆ విభాగం ఇన్‌చార్జ్ అధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం అకడమిక్ కమిటీహాల్‌లో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి ఆవిష్కరించారు. కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, యూనివర్సిటీ కాలే జి ప్రిన్సిపాల్ టి.మనోహర్, సోషల్ సైన్స్ డీన్ బి.సురేష్‌లాల్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.
పది కంటెయినర్లలో అమెరికా బేళ్ల దిగుమతి
పది కంటెయినర్లలో అమెరికా బేళ్ల దిగుమతి


