7న జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–17 చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు జనవరి 01, 2008 ఆ త ర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారుల్లో నలుగురు చొప్పున బాలబాలికలు డిసెంబర్ మూడో వారంలో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట చెస్ బో ర్డును తీసుకురావాలని, ఇతర మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
రూ.414 కోట్లతో కార్యకలాపాలు
● వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
వరంగల్ చౌరస్తా: బ్యాంకు వాటాదారుల సహకారంతో ఆరు నెలల వ్యవధిలో రూ.414 కోట్ల కార్యకలాపాలు నిర్వహించినట్లు వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు. ఆదివారం వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డులోని ముందాడ భవన్‌లో బ్యాంక్ అర్ధ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ.. బ్యాంకు వ్యాపార విస్తీర్ణాన్ని పెంచుతూ.. సభ్యులు రిజిస్టర్ బై నంబర్–2 సవరించుటకు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంకు పాలకవర్గ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు చకిల ఉపేందర్, మంద స్వప్న శ్రీనివాస్, బానోతు సీతా మహాలక్ష్మి శంకర్‌నాయక్, ఏవీ సత్యమోహన్, వడ్నాల సదానందం, నీలం మల్లేశం, మహమ్మద్ సర్వర్ పాషా, పత్తి కష్ణ, పొన్న హరినాథ్, కో–ఆపరేటివ్ ఆఫీసర్ అన్నమనేని జగన్ మోహన్‌రావు, బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావు పాల్గొన్నారు.


