మొదటి విడతలో 155 జీపీలు, 1,338 వార్డుల్లో ఎన్నికలు
నేటి నుంచి
మహబూబాబాద్: జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నేటి(గురువా రం) నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు 48 క్లస్టర్లు ఏర్పాటు చేసి 48 మంది ఆర్వోలు, ఇద్దరు ఏఆర్వోలకు విధులు కేటాయించారు.
జిల్లాలో 18 మండలాలు..
జిల్లాలో 18 మండలాలు ఉండగా 482 గ్రామపంచాయతీలు, 4,110 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈమేర కు మానుకోట నియోజకవర్గంలోని ఐదు మండలా లు మానుకోట, కేసముద్రం ఇనుగుర్తి , గూడూరు నెల్లికుదురులో మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తవుతాయి. ఆయా మండలాల పరిధిలో 155 గ్రామాలు ఉండగా 1,338 వార్డులు ఉన్నాయి.
48 క్లస్టర్లు ఏర్పాటు:
మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 48 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. గూడూరు మండలంలో 41 జీపీలు ఉండగా 12 క్లస్టర్లు, ఇనుగుర్తిలో 13 జీపీలకు 5 క్లస్టర్లు, కేసముద్రంలో 29 జీపీలకు 10 క్లస్టర్లు, మానుకోటలో 41జీపీలకు 12 క్లస్టర్లు, నెల్లికుదురు మండలంలో 31 జీపీలు ఉండగా 9 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. కాగా, 48 మంది రిటర్నింగ్ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కేటాయించారు. అదనంగా 9మంది ఆర్వోలకు విధులు కేటాయించారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు, జీపీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ప్రతీ నామినేషన్ సెంటర్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉంటుంది.
29వరకు నామినేషన్ల స్వీకరణ..
ఈనెల 27నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 27 ఓటరు జాబితా ప్రదర్శన, 30వ తేదీన పరిశీలన.. అదేరోజు సాయంత్రం 5గంటల తర్వాత అభ్యర్థుల జాబితా ఏర్పాటు చేస్తారు. వచ్చే నెల 1వ తేదీనఅప్పీళ్లు, 2వ తేదీ సాయంత్రం 5 గంటల వకు పరిష్కారం, 3వ తేదీ సాయంత్రం 3గంటల వరకు ఉపసంహరణ, ఆతర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఏర్పాటు చేస్తారు. 11వ తేదీ ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు..
ఎన్నికల అఽధికారులు సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు కేటాయించారు. వాటిలో ఉంగరం, కత్తెర, బ్యాట్, మంచం, క్యారంబోర్డు, వికెట్లు తదితర గుర్తులు ఉన్నాయి. వార్డు అభ్యర్థుల కోసం 20 గుర్తులు కేటాయించారు. వాటిలో గౌను, స్టౌవ్, స్టూల్, సిలిండర్, బీరువా, కుండ, గ్లాసు తదితర గుర్తులు ఉన్నాయి. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా గుర్తులు పెంచే అవకాశం ఉంటుంది.
సర్పంచ్, వార్డు అభ్యర్థులకు కేటాయించే గుర్తులు
నామినేషన్ పత్రాలతో..
ఫామ్–3, స్వీయ ప్రకటన, అనుబంధం–5, డిపాజిట్, నోడ్యూ సర్టిఫికెట్, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఆధార్‌కార్డు, కులం సర్టిఫికెట్ నామినేషన్ పత్రాలతో జత చేయాల్సి ఉంటుంది.
21 సంవత్సరాలు నిండి ఉండాలి
ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. విద్యార్హలతో కూడిన అఫిడవిట్‌లో ఇద్దరు సాక్షులతో సంతకం పెట్టించి ఇవ్వాల్సి ఉంటుంది.
నామినేషన్ పత్రంలో పార్ట్–1లో ప్రతిపాదించేవారి సంతకం, పార్ట్–2లో అభ్యర్థి సంతకం పెట్టాలి.
పార్ట్‌లో–3లో కూడా అభ్యర్థి సంతకం, పార్ట్–4లో ఆర్వో సంతకం ఉండాలి. పార్ట్–5, 6లో కూడా ఆర్వో సంతకాలు, ఖర్చుల డిక్లరేషన్‌లో అభ్యర్థి సంతకం ఉండాలి.
48 క్లస్టర్ల ద్వారా నామినేషన్ల స్వీకరణ
48మంది ఆర్వోలు, ఇద్దరు ఏఆర్వోలకు విధుల కేటాయింపు
నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల స్వీకరణ


