భారత రాజ్యాంగంపై అవగాహన అవసరం
తొర్రూరు: భారత దేశానికి తలమానికగా ఉన్న రాజ్యాంగంపై అన్నివర్గాల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దామెర ధీరజ్‌కుమార్ కోరారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి ధీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో పర్యటించి, అన్ని దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని అన్నివర్గాల ప్రజలకు సమ న్యాయం జరిగేవిధంగా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముకుందారావు, ఏజీపీ లింగాల శ్రీనివాస్, బార్ ప్రతినిధులు నాగరాజు, మహేష్, మధుసూదన్, ప్రవీణ్‌రాజు, వెంకటరత్నం, ఐలోని, విజయ, యాకేందర్, శ్రీధర్ పాల్గొన్నారు.
తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్
దళిత సంఘాల ఆధ్వర్యంలో..
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, రాయిశెట్టి వెంకన్న, రాయిశెట్టి ఉపేందర్, ధర్మారపు నాగయ్య, యాకేందర్, బాలాజీ, చంటి పాల్గొన్నారు...


