ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, సంబంఽఽధిత అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. నవంబర్ 23న ఫైనల్ చేసిన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం ఎన్నికల నిర్వహిస్తామన్నారు. ప్రతీ జిల్లాలో ఎంసీఎంసీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సంబంఽధిత అధికారులు పాల్గొన్నారు.
నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి
గూడూరు: జీపీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆర్డీఓ కృష్ణవేణి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల అధికారులతో ఎన్నికల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దరఖాస్తు పత్రాలు ఎన్నికల నియమాళికి అనుగుణంగా ఉండేలా చూడాలని, ఏమైనా తప్పిదాలు జరిగితే పక్కన పెట్టాలన్నారు. నిబంధనల మేరకు దరఖాస్తుదారుడు అన్ని పత్రాలు జమ చేసి ఇచ్చేలా చూడాలన్నారు. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, నిబంధనల ప్రకారం పోలీసులు తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
నెల్లికుదురు: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తొర్రూరు ఆర్డీఓ గణేష్ తెలిపారు. బుధవారం మండలంలోని నైనాల నామినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. మండలంలో నామినేషన్ల స్వీకరణకు 9 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో సెంటర్‌కు ఆర్వోతో పాటు ఆ సెగ్మెంట్ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సింగారపు కుమార్, తహసీల్దార్ చంద నరేష్, ఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన ఉపాధ్యాయులకు మూడో దఫా శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యసన సామగ్రిని ఉపయోగించి విద్యాబోధన చేయాలని, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. రిసోర్స్‌పర్సన్లు చెప్పే అంశాలను పాఠశాలల్లో కొనసాగించాలన్నా రు. కార్యక్రమంలో ఏటీడీఓ ఉపేందర్, జీసీ డీఓ విజయ, డీఆర్పీ శ్రీకాంత్, పాఠశాల హెచ్‌ఎం నర్సయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


