పరికరంతో కార్మికులకు రక్షణ
భవన నిర్మాణాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు పని చేసేటప్పుడు పొరపాటున భవనం పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ప్రాణాలను రక్షించేందుకు భద్రతా పరికరాలు ఉపయోగపడుతాయి. పరికరంలో శరీర కదలికలను గుర్తించే సెన్సార్లు ఉంటాయి. కిందపడేటప్పుడు సెన్సార్ వెంటనే గుర్తించి ఎయిర్‌బ్యాగ్, గాలి కుషన్‌ను ఆటోమేటిక్‌గా తెరుస్తుంది. తద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
– ఏర్రోజు రాఘవ, విద్యార్థి,
బయ్యారం జెడ్పీహెచ్‌ఎస్


