నూతన ఆవిష్కరణలు రూపొందించాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు నూతన ఆవిష్కరణలు రూపొందించాలని ఏసీజీఈ మందుల శ్రీరాములు అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో బుధవారం జిల్లా స్ధాయి ఇన్‌స్పైర్, సైన్స్‌ఫెయిర్ ప్రదర్శనలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏసీజీఈ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న నెపుణ్యాలను సైన్స్‌ఫెయిర్ ద్వారా వెలికితీయవచ్చన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. మన జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందని, ప్రతీ విషయంలో సైన్స్ దాగి ఉందన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అవార్డులు అందించారు. రాష్ట్రస్థాయికి 10 ఇన్‌స్పైర్ ప్రదర్శనలు, 14 సైన్స్‌ఫెయిర్ ప్రాజెక్టులు ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రాందాస్, యాదగిరి, దేవేంద్రచారి, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముగిసిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, సైన్స్‌ఫెయిర్ ప్రదర్శనలు
24 ప్రాజెక్ట్‌లు రాష్ట్రస్థాయికి ఎంపిక


