పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మరిపెడ: మాకుల చెరువు కట్ట ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల చెరువును మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాఽథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మరిపెడ పట్టణంలోని మాకుల చెరువు అభివృద్ధికి రూ. 2 కోట్లు కేటాయించడం జరిగిందని, పనులను వేగంగా చేసి పూర్తి చేయాలని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లల హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం షెడ్యూల్ ప్రకారం అందించాలన్నారు. తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ విజయానంద్ తదితరులు ఉన్నారు.
ఏజెంట్ల పూర్తి వివరాలు ఇవ్వాలి..
మహబూబాబాద్: ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ప్రతిపాదిత ఏజెంట్ల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజ కీయ పార్టీల ప్రతినిధులతో బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులు బూ త్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, రాజ కీయ పార్టీ నాయకులు అజయ్ సారథిరెడ్డి, రాజ మౌళి, సురేష్, శ్యాంసుందర్, కిరణ్, రామారావు, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్ పాల్గొన్నారు.


