ముగిసిన రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు
డోర్నకల్: డోర్నకల్‌లో నిర్వహించిన 69వ ఎస్‌జీ ఎఫ్ రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన పోటీల్లో పది ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీ డాకారులు పాల్గొన్నారు. బాలురు, బాలికల విభా గాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన వారిని నవంబర్ 26 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లో జరగనున్న 69వ ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బాలికలకు సంబంధించి 44 కేజీల విభాగంలో బి.భాగిత, 48 కేజీల విభాగంలో ఎం. సహస్ర, 53 కేజీల విభాగంలో తానిశ్రీ, 58 కేజీల విభాగంలో టి.అర్చన, 63 కేజీల విభాగంలో జి.అంజలి, 69 కేజీల విభాగంలో వి.హరిత, 77 కేజీల విభాగంలో కె.సంయుక్త, 77 కేజీల విభాగంలో బి.తోషిని విజ యం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. బాలురకు సంబంధించి 56 కే జీల విభాగంలో బి.నందకిశోర్, 60 కేజీల విభాగంలో సి.హెచ్. దీపక్, 65 కేజీల విభాగంలో ఎన్. సిద్దు, 71 కేజీల విభాగంలో కె.ధనుశ్, 79 కేజీల విభాగంలో ఎస్. ముజీబ్, 88 కేజీల విభాగంలో సి.హెచ్. శరత్‌చంద్ర, 98 కేజీల విభాగంలో బి.నౌశిక్, 98 కేజీల ప్లస్ విభాగంలో కె.అభిషేక్ విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జేఎన్‌ఎస్‌లో ముగిసిన జిమ్నాస్టిక్స్,
జూడో పోటీలు..
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు కొనసాగిన ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి. ప్రశాంత్ తెలిపారు. ముగింపు సందర్భంగా విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జూడో క్రీడాకారులు ఈ నెలలో మణిపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని, జిమ్నాస్టిక్స్ విజేతలను డిసెంబర్‌లో కోల్‌కతాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, భూపాలపల్లి డీవైఎస్‌ఓలు గుగులోత్ అశోక్‌కుమార్, సి.హెచ్. రఘు, టీజీ పీఈటీల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి. సుధాకర్, జిల్లా అద్యక్షుడు ఎస్. పార్థసారథి, ప్రధాన కార్యదర్శి కె. మల్లారెడ్డి, టీఎస్ పీఈటీల సంఘం అధ్యక్షుడు ఎ. ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి. కుమార్, సి.హెచ్. పెద్దిరాజు, ఎం. సురేశ్‌బాబు, ఎస్. శ్రీలత, పీడీలు ఆర్. సుభాష్, సి.హెచ్. వెంకటేశ్వర్లు, రవీంద్రప్రసాద్, నీలం సురేశ్, రజిత, హరీశ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే
రాష్ట్ర జట్ల ఎంపిక
ముగిసిన రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు


