ఇందిరమ్మ ఇళ్ల పేరిట దందా!
చిన్నగూడూరు: మండల కేంద్రం శివారు ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లోడ్‌తో ట్రాక్టర్లు మండల కేంద్రం ప్రధాన వీధుల గుండా వెళ్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వీధుల గుండా నిత్యం పాఠశాలల విద్యార్థులు, రైతులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండడంతో ఇసుక ట్రాక్టర్ల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమంగా ఇసుక రవాణా


