మద్యం షాపులకు 1,800 దరఖాస్తులు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో మద్యం షాపుల ఏర్పాటుకు 1,800 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 26న దరఖాస్తుల స్వీకరణ మొదలై ఈనెల 18వరకు గడువు ఇచ్చారు. అప్పటి వరకు 1,648 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఈ నెల 23వరకు గడువు పెంచగా.. 1,800 దరఖాస్తులు రావడంతో రూ.54 కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 27న లక్కీ డ్రా ద్వారా షాపులను కేటాయించనున్నారు.
పెరిగిన లైసెన్స్ ఫీజు..
మద్యం షాపుల ఏర్పాటు కోసం లైసెన్స్ ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో గతం కంటే తక్కువగా 1,800 దరఖాస్తులు వచ్చినప్పటికీ అధికంగా రూ.54 కోట్ల ఆదాయం సమకూరింది. 2023–25 వార్షిక సంవత్సరంలో 59 వైన్ షాపులకు 2,589 దరఖాస్తులు రాగా, రూ.51.78 కోట్ల ఆదాయం సమకూరింది.
27న లక్కీ డ్రా..
2025–27 కాలపరిమితికి సంబంఽధించి ప్రారంభంలో మందకొడిగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో గతంలో 59 వైన్‌షాపులు ఉండగా, ప్రస్తుతం రెండు నూతన షాపులు ఏర్పాటు చేయనుండడంతో సంఖ్య 61కి చేరినప్పటికీ.. గతంలో కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినప్పటికీ ఆదాయం పెరిగింది. కా గా, జిల్లాలోని మానుకోటఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 667, తొర్రూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 769, గూడూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 364 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 27న కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి ఎంపికై న దరఖాస్తుదారులకు మద్యం షాపులను కేటాయించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ తెలిపారు.
గతంతో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు, పెరిగిన ఆదాయం
ఈ నెల 27న లక్కీ డ్రా


