వైద్యుడి చీటీ లేకుండా
అమ్ముతున్న ఔషధాలివి..
జిల్లాలో విచ్చలవిడిగా మత్తు మందుల విక్రయాలు
తొర్రూరు: జిల్లాలోని కొన్ని ఔషధ దుకాణాల్లో విచ్చలవిడిగా మత్తు మందుల విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా తొర్రూరులోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు మత్తు కలిగించే టాబ్లెట్లు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నల్లగొండకు చెందిన ముఠాకు మందులు విక్రయించగా వారు ఎక్కువ ధరకు అమ్మకాలు చేశారు. సమాచారం అందుకున్న నల్ల గొండ పోలీసులు తొర్రూరుకు చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దందా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల చీటీలు లేకుండా నిషేధిత, వాడకూడని మందులను అమ్ముతున్నారు. అధికశాతం దుకాణాల్లో మత్తు పదార్థాలు, గర్భవిచ్ఛిత్తి మాత్రలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిఘా కొరవడింది.
నిబంధనలకు నీళ్లు..
మత్తు మందులకు సంబంధించి విక్రయాలు జిల్లా వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. జిల్లాలో 1000కి పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. రోజూ రూ.లక్షల్లో వ్యాపారం సాగుతోంది. నిద్రమాత్రలు, మత్తును కలిగించే దగ్గు టానిక్‌లు, ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి ఇచ్చే సీరియస్ యాంటీ బయోటిక్స్ మందులు విక్రయించాలంటే వైద్యుల ప్రిస్కిప్షన్ చీటీ ఉండాల్సిందే. ‘పారాసెటమాల్, డైసైక్లోమైన్, ట్రామాడల్ సమ్మిళిత ఔషధాన్ని తీవ్రమైన నొప్పి నివారణకు వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ‘ట్రామాడల్’ అనే ఔషధం ‘ఓపియాయిడ్స్’ అనే మాదక ద్రవ్యాల జాబితాకు చెందింది. మెదడులోని ‘నోర్‌పైన్‌ఫ్రైన్’, ‘సెరోటోనిన్’పై పని చేసి, నొప్పిని తెలియనివ్వదు. కొందరు దీన్ని మత్తు కోసం ఎక్కువ మోతాదులో వాడుతున్నట్లు గుర్తించారు. దుకాణాల నిర్వాహకులు ఈ నిబంధన పట్టించుకోవడం లేదు. అన్ని దుకాణాల్లో ఫార్మసిస్టులు ఉండాలి. చాలా దుకాణాల్లో వారిని నియమించుకోవడం లేదు. దుకాణాల నిర్వాహకులే మందులు విక్రయిస్తున్నారు. పెద్ద మెడికల్ షాపుల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన, నైపుణ్యం లేని వాళ్లతో పని చేయించుకుంటున్నారు. మందులపై అవగాహన లేకపోవడంతో దుష్ఫలితాలు వస్తున్నాయి. మత్తు ఇచ్చే డ్రగ్స్‌కు విద్యార్థులు, యువకులు బానిసలవుతున్నారు. దీనికి అధికారులు అడ్డుకట్ట వేయకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
ఎటువంటి వైద్య పరీక్షలు, డాక్టర్ సలహా లేకుండా మందులు విక్రయించవద్దు. మెడికల్ షాపు నిర్వాహకులు నార్కోటిక్ డ్రగ్స్ విక్రయించేందుకు నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉండాలి. మత్తు కలిగించే ఔషధాలు డాక్టర్ సలహా లేకుండా వాడడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఫార్మసిస్టు లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు.
– పగిడిపాటి సుగుణాకర్‌రాజు,
తొర్రూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
యాంటీ డిప్రెషన్: డయాజెపమ్, నైట్రాజెపమ్, మెలటోనిన్, మిర్టాజపిన్, నార్‌ట్రిప్టిలైన్, ట్రాజడోన్, జలప్లొన్, జోల్‌పిడెమ్, జోపిక్లోన్
నొప్పి నివారణ మాత్రలు: బుప్రెనొర్పిన్, ట్రామాడల్, టిడిజెసిక్, స్పాస్మో ప్రొక్సివోన్
అలర్జీ, జలుబు మాత్రలు: ఫెనిరమైన్, క్లోర్‌ఫెనిరమైన్ మెలేట్, సిట్రజిన్, హైడ్రోక్సిజిన్
డిప్రెషన్, దగ్గు, నొప్పి ఔషధాల
అమ్మకాలు
వైద్యుల చీటీ లేకుండానే
విక్రయిస్తున్న దుకాణదారులు
తొర్రూరులో మెడికల్ షాపు
నిర్వాహకుడి అరెస్టు
నిఘా వైఫల్యం?
నిఘా వైఫల్యం?
నిఘా వైఫల్యం?


