శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
● అనంతారం మోడల్ స్కూల్‌లో అంతర్గత గొడవలు
● డీఈఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు
మహబూబాబాద్ అర్బన్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మోడల్ స్కూళ్లలో విద్యాబోధన జరుగుతుండడంతో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారాయి. గత విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్ ఐటీ, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు సీట్లు సాధించారు. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో విద్యాబోధన గాడి తప్పుతోంది. ఉపాధ్యాయుల మధ్య అంతర్గత గొడవల వల్ల డీఈఓ, కలెక్టర్‌కు విద్యార్థులతో ఫిర్యాదు చేయిస్తూ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025


