
కిరాణా షాపులో చోరీ
● రూ.1.80లక్షల విలువైన వస్తువుల
అపహరణ
కేసముద్రం: మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ కిరాణం షాపు(హోల్‌సేల్)లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.1.80 లక్ష విలువైన వస్తువులను అపహరించిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చో టుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. కేసముద్రం మున్సిపాలిటీ మార్కెట్ రోడ్డులోని మాచాముండా కిరాణం షాపు(హోల్‌సేల్)కు సోమవారం రాత్రి ఎప్పటిలాగే తాళం వేసి వ్యాపారులు వెళ్లిపోయారు. అర్థరాత్రి దాటాక గుర్తు తెలి యని వ్యక్తులు షాపు వెనుక నుంచి తాళం పగులగొట్టుకుని లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత షాపు ముందు డోర్ వేసిన తాళాన్ని పగులగొట్టారు. మొ త్తంగా రూ.లక్ష విలువైన సిగరేట్ కాటన్‌లు, డెస్క్ లో ఉన్న చిల్లర డబ్బులను ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం షాపు యజమాని దేవాశీ పే రాజా రాం చూసి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. చోరీకి పాల్పడింది ముగ్గురు వ్యక్తులుగా ఆ పుటేజ్‌లో దృశ్యాలు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడే ముందు కొన్ని సీసీ కెమెరాలను ఆ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాగా వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు.