
జంపన్నవాగులో సాయిగౌతమ్ మృతదేహం లభ్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని మేడారం జంపన్నవాగులో ఓ బాలుడి మృతదేహం ఈనెల 20న లభ్యమైంది. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు ఎస్సీ కాలనీకి చెందిన దానూరి సాయిగౌతమ్(17)గా పోలీసులు గుర్తించారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దానూరి సాయిగౌతమ్‌తోపాటు మరికొంతమంది కలిసి ఈనెల 12న అమ్మవార్ల దర్శనం కోసం మేడారం వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వంటావార్పు చేసుకుని స్నానాల కోసం ఊరట్టం కాజ్‌వే వద్ద జంపన్నవాగులోకి దిగారు. సాయిగౌతమ్ వాగు అవతలివైపు ఒడ్డుకు వెళ్లాడు. మిగతా వాళ్లు అటువైపు ఎందుకు వెళ్తున్నావంటూ అడగా మలవిసర్జనకు వెళ్లొస్తానని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా ఆచూకీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికినా జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఈనెల 19న మేడారానికి వచ్చి గౌతమ్ ఆచూకీ కోసం వెతుకులాడుతున్న క్రమంలో 20న ఊరట్టం కాజ్‌వే వద్ద జంపన్నవాగులో సాయిగౌతమ్ మృతదేహం తేలింది. రెస్క్యూటీం బయటకు తీశారు. ప్రమాదవశాత్తు సాయిగౌతమ్ వాగులో పడి మృతి చెందినట్లు సోదరుడు సాయిగణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
మృతుడిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా